తెలంగాణలో ఒక్కరోజులోనే ఇన్ని కేసులా?

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని నెలల తర్వాత తెలంగాణలో వెయ్యి కేసులు దాటాయి

Update: 2022-08-05 02:17 GMT

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని నెలల తర్వాత తెలంగాణలో వెయ్యి కేసులు దాటాయి. ఒక్కరోజులోనే 1,061 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదు. కరోనా కేసులు వెయ్యి దాటడం ఆందోళన కల్గిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వల్లనే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 401 కేసులు నమోదయ్యాయి.

పెరుగుతున్న యాక్టివ్ కేసులు...
ఇక తెలంగాణలో ఇప్పటి వరకూ 8,23,724 కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 8,13,254 మంది కోలుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది తెలంగాణ రాష్ట్రంలో మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,357 కు చేరుకున్నాయి. ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. శుభకార్యాలయాలకు వెళ్లినా విధిగా మాస్క్ లను ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News