తెలంగాణలో కరోనా అప్‌డేట్
ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతో కరోనా వైరస్ కేసులు తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతో కరోనా వైరస్ కేసులు తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీగా కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 32,834 మందికి పరీక్షలు చేస్తే 705 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే నిన్న ఒక్క రోజులో 532 మంది కోలుకున్నారని తెలిపింది.
యాక్టివ్ కేసులు
తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 8.19 లక్షలకు చేరింది. వీరిలో దాదాపు 8.17 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది కరోనా కారణంగా మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 5,543 యాక్టివ్ కేసులున్నాయి. మొన్నటి వరకూ వందల సంఖ్యలో ఉన్న యాక్టివ్ కేసులు నేడు ఐదువేలు దాటడం ఆందోళన కల్గిస్తుంది.