తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వెయ్యికి చేరువలోకి కేసులు నమోదవుతున్నాయి

Update: 2022-07-30 03:16 GMT

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వెయ్యికి చేరువలోకి కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 923 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఎవరూ కరోనా కారణంగా మరణించలేదు. మరణాలు లేకున్నా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నమోదయిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 365 కరోనా కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

యాక్టివ్ కేసులు...
దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 8,18, 290 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,09,909 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,170 కి చేరాయి. యాక్టివ్ కేసులు పెరుగుతుండటం కూడా ఆందోళన కలిగిస్తుంది.


Tags:    

Similar News