హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రోజుకు 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి

Update: 2022-08-02 03:23 GMT

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రోజుకు 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒక్కరోజులో 771 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఎవరూ మరణించలేదు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉందని, హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని వైద్యశాఖ అధికారులు తెలిపారు.

యాక్టివ్ కేసులు...
హైదరాబాద్ లోనే అత్యధికంొగా 289 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 5,733 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 8,20,617 మంది కరోనా వైరస్ బారిన పడ్డారుద. వీరిలో 8,10,773 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరిస్తుంది. అప్రమత్తంగా లేకపోతే వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తుంది.


Tags:    

Similar News