తెలంగాణలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయ్
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తుంది
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 992 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్క మరణం కూడా సంభవించలేదు. కేసుల సంఖ్య పెరుగుతుండటంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. నిన్న ఒక్కరోజులో 852 మంది కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. 992 కొత్తగా నమోదయిన కేసుల్లో 376 కేసులు హైదరాబాద్ లోనే రావడం విశేషం.
మరణాలు లేకున్నా....
ఇక తెలంగాణలో ఇప్పటి వరకూ 8,22,663 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటి వరకూ 8,12,420 మంది కరోనా చికిత్స పొంది బయటపడ్డారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 6,132 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.