తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. నిన్నటి వరకూ రెండు వందలకు దిగువనే నమోదయిన కేసులు నేడు పెరగడంతో ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,76,943 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 3,999 మంది మరణించారు.
కోలుకున్న వారు....
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే 70 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,69,157 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,779 ఉన్నాయి.