హైదరాబాద్ లో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత వారం రోజులుగా నాలుగు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

Update: 2022-06-29 04:04 GMT

తెలంగాణలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత వారం రోజులుగా నాలుగు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 459 మందికి కరోనా సోకింది. అయితే కరోనాతో ఎవరూ మరణించలేదు. ప్రజలు పూర్తిగా కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేయడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా మాస్క్, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుతుంది. లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతుంది.

మరణాలు మాత్రం....
కొత్తగా నమోదయిన 459 కరోనా కేసుల్లో 232 కేసులు హైదరాబాద్ లోనే వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,99,991 కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 7,91,708 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించినట్లు వైద్య శాఖ తెలిపింది. హైదరాబాద్ వాసులు మరింత జాగ్రత్త వహించాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు పదే పదే కోరుతున్నారు.


Tags:    

Similar News