తెలంగాణలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు రెండు వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి

Update: 2022-06-19 03:02 GMT

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు రెండు వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 247 మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఎవరూ ఆసుపత్రుల్లో చేరడం లేదు. కానీ కరోనా కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో 157 కేసులు నమోదయ్యాయి.

జాగ్రత్తలు పాటించకుంటే...
తెలంగాణలో ఇప్పటి వరకూ 7,95,819 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 7,89,796 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 1,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం వల్లనే కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి ఎవరూ ఆసుపత్రుల్లో అడ్మిట్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News