తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 162 కరోనా కేసులు నమోదయ్యాయి
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 162 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
మరణాల సంఖ్య....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,80,413 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 6,72,847 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3,547 వరకూ ఉన్నాయి. కరోనా బారిన పడి తెలంగాణలో ఇప్పటి వరకూ 4,019 మరణించారు