తెలంగాణపై మళ్లీ కరోనా పంజా
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 400 కు పైగా కేసులు నమోదవుతున్నాయి
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 400 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 477 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఎవరూ కరోనా కారణంగా మరణించలేదు. భారీగా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలకు సూచించింది. మాస్క్ లను ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటితో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు నిత్యం ప్రచారం చేస్తుంది.
యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 7,99,532 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 7,91,461 మంది కరోనా నుంచి కలోకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 3,960కి చేరుకున్నాయి. తాజాగా నమోదయిన 477 కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 258 కేసులు నమోదయ్యాయి.