తెలంగాణలో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రత రోజు 600 కు పైగా కేసులు నమోదవుతున్నాయి.

Update: 2022-07-21 04:01 GMT

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రత రోజు 600 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కల్గించే అంశంగానే చూడాలి. గత ఐదు రోజుల నుంచి ఆరు వందలకు పైగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ఒక్కరోజులోనే 31,625 మందికి పరీక్షలు నిర్వహించగా 640 మంది కరోనా వైరస్ సోకింది. మరణాలు మాత్రం నమోదు కాకపోవడం ఊరట కల్గించే అంశం.

యాక్టివ్ కేసులు...
ఇక తెలంగాణలో ఇప్పటి వరకూ 8.11 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజులోనే 659 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 8.03 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.


Tags:    

Similar News