తెలంగాణలో ఆగని కరోనా
తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. కొద్దిరోజులుగా వరసగా 500 కేసులకు పైగా నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కల్గిస్తుంది
తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. కొద్దిరోజులుగా వరసగా 500 కేసులకు పైగా నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే తెలంగాణలో 562 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మరణాలు సంభవించలేదు. అయినా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సోకిన వారు రెండు, మూడు రోజుల్లో కోలుకుంటుండటంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం లేదు. క616 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
హైదరాబాద్ లోనే..
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,07,134 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 7,97,911 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకి ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 5,112 ఉన్నాయని అధికారులు చెప్పారు. కొత్తగా నమోదయిన 562 కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 329 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.