తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
క్రమంగా తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 155 కరోనా కేసులు నమోదయ్యాయి.
క్రమంగా తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొద్ది నెలలుగా జీరో కేసులు నమోదవుతున్న సమయంలో కోవిడ్ నిబంధనలను పాటించడం లేదు. దీంతో కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతుంది. తాజాగా తెలంగాణాలో 155 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించకపోయినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య తెలంగాణలో ప్రస్తుతం 907గా ఉండటం విశేషం.
హైదరాబాద్ లోనే...
155 కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 81 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంంగాణలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,94,184 కు గా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4,111 ల మంది మరణించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి తమ కార్యకలాపాల్లో పాల్గొనాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భౌతికదూరాన్ని పాటిస్తూ మాస్క్ లను ధరిస్తూ కరోనా నియంత్రణకు కృషి చేయాలని ప్రజలను కోరుతున్నారు. శానిటైజర్ల వాడకం కూడా పూర్తిగా తగ్గడంతో కరోనా కేసుల పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు.