తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు

తెలంగాణలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 285 మందికి కరోనా వైరస్ సోకింది.

Update: 2022-06-17 02:06 GMT

తెలంగాణలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 285 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం 248,424 మందికి పరీక్షలు జరపగా 285 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మరణాలు మాత్రం లేవు. కరోనా నిబంధనలను పాటించకపోవడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడం ఎక్కువ మంది గుమి కూడటం, వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడం వల్ల కూడా తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

కోవిడ్ నిబంధనలను...
ఇప్పటి వరకూ తెలంగాణలో 7,95,293 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 7,89,561 మంది కోలుకున్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కోరుతుంది.


Tags:    

Similar News