కాంగ్రెస్ నిరసనలు షురూ.. నిధుల కేటాయింపునకు డిమాండ్

ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు

Update: 2025-02-02 12:09 GMT

ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని ఆరోపిస్తూ తమ ఆందోళనను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వం వహించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలను పంపినా బుట్టదాఖలా చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని...
ప్రజాక్షేత్రంలోనే కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగడతామని తెలిపారు. అన్ని పార్టీలూ కలసి ఉద్యమించాలని కూడా పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ కూడా తమతో కలసి రావాలని కోరారు. కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు సమిష్టిగా అందరం కలసి పోరాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. నిధులు ఇచ్చి తెలంగాణలోని పలు ప్రాజెక్టులు పూర్తయ్యేలా కేంద్రం సహకరించాలని కోరారు.


Tags:    

Similar News