Revanth Reddy : ఉస్మానియా వర్సిటీకి రేవంత్ భారీ నజరానా
తెలంగాణకు పర్యాయపదం ఉస్మానియా యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణకు పర్యాయపదం ఉస్మానియా యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూ కోసం ఎన్ని నిధులయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఓయూలో వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన నిధులు అడగాలని, సంకోచించవద్దని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో పనులకు కావాల్సిన అంచనాలను రూపొందించాలని, డిసెంబరు నాటికి తనకు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి కావాలంటే అది ఇస్తానని తెలిపారు.
మళ్లీ డిసెంబరులో వస్తా...
మళ్లీ డిసెంబరులో తాను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని, ఈసారి ఆర్ట్స్ కళాశాల ఎదుట బహిరంగ సభకు హాజరవుతానని, ఆరోజు పోలీసులు కూడా వద్దని, ఎవరినీ అరెస్ట్ చేయవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కులుంటాయన్న రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైనా మారుమూల ప్రాంతం నుంచి చదువుకోవడానికి వచ్చినవారేనని అన్నారు. యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ లేదన్న రేవంత్ రెడ్డి ఎన్ని నిధులయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అందుకు అంచనాలు రూపొందించి తనకు ఇచ్చే బాధ్యత మీదేనని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యలను అన్నింటినీ తీర్చడానికి తాను ఖచ్చితంగా ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.