నేడు బీఆర్ఎస్ దీక్షా దివస్

నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ నిర్వహిస్తుంది.

Update: 2024-11-29 04:10 GMT

నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్‌ దీక్షకు 15 ఏళ్లు పూర్తి కావడతో నేడు దీక్షా దివస్ ను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేనుంది. . నేడు కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌కు కేటీఆర్‌ వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు అమరవీరుల స్థూపానికి నివాళి అర్పిస్తారు. అనంతరం బైక్‌ ర్యాలీతో అలుగునూరు చౌరస్తా కేటీఆర్‌ చేరుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం...
కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం కేటీఆర్‌ చేయనున్నారు. దీక్షా దివస్‌ బహిరంగ సభలో పాల్గొననున్న కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. తెలంగాణ కోసం నవంబరు 29వ తేదీన దీక్షను చేపట్టారు. దీక్షకు దిగి వచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. అందుకే నేడు రాష్ట్రమంతటా దీక్షా దివస్ ను జరుపుకోవాలని గులాబీ పార్టీ నిర్ణయించింది.


Tags:    

Similar News