మూడో విడత ఎన్నిలకు నామినేషన్ల పరిశీలన పూర్తి

మూడోవిడత పంచాయతీ నామినేషన్లను అధికారులు పరిశీలించారు.

Update: 2025-12-06 12:41 GMT

మూడోవిడత పంచాయతీ నామినేషన్లను అధికారులు పరిశీలించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,158 సర్పంచ్‌ స్థానాలకు 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి. 36,442 వార్డులకు 89,603 నామినేషన్లు దాఖలు కాగా వాటిని ఎన్నికల అధికారులు పరిశీలించారు. ఈరోజు మూడో విడత నామినేషన్లకు తుది గడువు కావడంతో అన్ని నామినేషన్లను పరిశీలించారు.

అత్యధికంగా సిద్ధిపేట జిల్లాలో...
సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9వ తేదీ గడువుగా నిర్ణయించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11వ తేదీన తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి.


Tags:    

Similar News