Telangana : మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో
తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డును సృష్టించాయి
తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డును సృష్టించాయి. నాలుగు రోజుల్లోనే దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 1వ తేదీనుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతోనే ఈ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు అభిప్రాయం వ్యక్తమవుతుంది.
600 కోట్లు నాలుగు రోజుల్లో...
తెలంగాణ రాష్ట్రంలోచలి వాతావరణంలోనూ మద్యం ప్రియులు చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది నాలుగు రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల ఇంకా మద్యం అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు.