Telangana : ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు

Telangana : ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు

Update: 2025-12-06 06:05 GMT

ఉగ్రవాదుల చెరలో ఒక తెలంగాణ యువకుడు చిక్కుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రవీణ్ దక్షిణాఫ్రికాలోని మాలి దేశంలో బోర్ వెల్ కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. బండసోమారానికిచెందిన ప్రవీణ్ గత ఏడాది నవంబరులో బోర్ వెల్ కంపెనీ తరుపున మాలికి వెళ్లాడు. అయితే మాలి దేశంలోని కోబ్రి ప్రాంతానికి వెళ్లిన ప్రవీణ్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. గత నెల 22వ తేదీన ప్రవీణ్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చివరగా చేసినట్లు చెబుతున్నారు.

ఫోన్ స్విచాఫ్ రావడంతో...
తర్వాత రోజు నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచాఫ్ రావడంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ నెల 4వ తేదీన బోర్ వెల్ కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి కిడ్నాప్ అయినట్లు సమాచారం అందించారు. అయితే ప్రవీణ్ ను కిడ్నాప్ చేసింది జెఎన్ఐఎం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అయితే ఉగ్రవాదుల చెర నుంచి ప్రవీణ్ ను కాపాడేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తుంది. ప్రవీణ్ ను విడిపించేందుకు ప్రయత్నించాలని ప్రవీణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Tags:    

Similar News