యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయ్
తెలంగాణలోనూ కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత పదిహేను రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
తెలంగాణలోనూ కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత పదిహేను రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నిన్న 24,927 మందికి పరీక్షలు నిర్వహించగా 531 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి మరణాలు సంభవించడం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే కరోనా సమస్య తీవ్రత మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అప్రమత్తంగా లేకుంటే....
ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 8.14 లక్షలకు చేరింది. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి 612 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 8.05 లక్షల మంది కోలుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 4,630 వరకూ ఉండటం ఆందోళన కల్గిస్తుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.