హార్దిక్ పాండ్యా మీద వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్

Update: 2022-10-26 05:52 GMT

ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మొదట మూడు వికెట్లు తీసి.. ఆ తర్వాత బ్యాటింగ్ లో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ విరాట్ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని ఊహాగానాలు వచ్చాయి, అయితే మేనేజ్‌మెంట్ ఎవరికీ విశ్రాంతి ఇవ్వడం లేదని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నారు. ''మేము ఎవరికీ విశ్రాంతి ఇవ్వడం లేదు. టోర్నమెంట్ లో మరింత ముందుకు వెళ్లే అనుకూలత మాకుంది. విడిగా ఆటగాళ్లు అందరూ ఫామ్ లోకి రావాల్సి ఉంది''అని తెలిపారు. హార్దిక్ అన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాడు.. ఎవరికీ విశ్రాంతి ఇవ్వాలని మేము చూడటం లేదు, అతను మాకు ముఖ్యమైన ఆటగాడు, అతను బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు.. అలాంటి ఆటగాడికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు లేవని నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు మాంబ్రే బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు.

రేపు సిడ్నీ వేదికగా భారత్ నెదర్లాండ్స్ తో తలపడనుంది.
భారత్ స్క్వాడ్ : రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ
నెదర్లాండ్స్ స్క్వాడ్: ప్లేయింగ్: స్కాట్ ఎడ్వర్డ్స్ (సి), కోలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, లోగాన్ వాన్ బీక్, టామ్ కూపర్, బ్రాండన్ గ్లోవర్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, ఫ్రెడ్ క్లాసెన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డర్ మైబర్గ్, తేజ నిడమనూరు, మాక్స్ ఓ'డౌడ్, టిమ్ ప్రింగిల్, విక్రమ్‌జిత్ సింగ్


Tags:    

Similar News