బుమ్రాకు తోడెవ్వరు?
హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 3వ రోజున భారత ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచ్‌లను వదిలివేసారు. భారత ఫీల్డింగ్ చాలా నిరాశపరిచింది
Bumrah
హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 3వ రోజున భారత ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచ్‌లను వదిలివేసారు. భారత ఫీల్డింగ్ చాలా నిరాశపరిచింది, పలు అవకాశాలు వచ్చినా భారత్ అందిపుచ్చుకోలేకపోయింది. ఈ తప్పిదాల కారణంగా ఇంగ్లాండ్ తిరిగి పుంజుకుంది. చివరికి భారత్ కేవలం ఆరు పరుగుల తేడాతో మొదటి ఇన్నింగ్స్ లీడ్ ను సంపాదించింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 471 పరుగులకు సమాధానంగా, ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు కేవలం 6 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో రాణించాడు. భారత ఫీల్డర్లు సరైన తోడ్పాటును అందించి ఉండి ఉంటే భారత్ మరింత మెరుగైన స్థితిలో ఈ మ్యాచ్ లో ఉండేది