గ్రేటెస్ట్ క్యాచ్ డ్రాప్ అంటున్నారు..!

కొందరు సులువైన క్యాచ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చేసే తప్పులు చివరికి కామెడీగా

Update: 2022-06-17 04:56 GMT

క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటుంటారు.. ఎందుకంటే క్రికెట్ లో చిన్న అవకాశాలను కూడా ఒడిసిపట్టేసుకుంటూ ఉండాలి. బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడుతూ ఉన్నప్పుడు తక్కువ తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో అద్భుతమైన క్యాచ్ లు అందుకుని ఫీల్డర్స్ మ్యాచ్ ను ఊహించని మలుపు తిప్పుతూ ఉంటారు. ఇలాంటి ఘటనలు మైదానంలో మనం ఎన్నో చూసి ఉంటాం. క్యాచ్ పట్టాలంటే కాస్త స్కిల్స్.. ఏకాగ్రత చాలా ముఖ్యం. అందుకే అద్భుతమైన ఫీల్డర్లు కూడా కొన్ని కొన్ని సార్లు ఊహించని తప్పు చేస్తూ ఉంటారు. క్యాచ్ డ్రాప్ ల వలన జట్టు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బౌలర్ చేసిన క్యాచ్ డ్రాప్ మిస్టేక్ గురించి చర్చ సాగుతూ ఉంది.

కొందరు సులువైన క్యాచ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చేసే తప్పులు చివరికి కామెడీగా మారిపోతూ ఉంటాయి. తాజాగా ఒక 16 ఏళ్ల క్రికెటర్ ఒక విలేజ్ లీగ్ గేమ్‌లో సునాయాసంగా వచ్చిన బాల్ ను కాస్తా మిస్ చేయడం మనం చూడవచ్చు. అయితే ఆ తర్వాత అతడి అదృష్టం బాగుండి.. బ్యాట్స్మెన్ కు టైమ్ బాగోలేక అవుట్ అయ్యాడు. ఆల్డ్‌విక్ క్రికెట్ క్లబ్ తరపున ఆడే అలెక్స్ రైడర్, లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన విలేజ్ లీగ్ గేమ్‌లో నమ్మశక్యం కాని క్యాచ్ పట్టాడు. బౌలింగ్ వేశాక కాట్ అండ్ బౌల్డ్ అవకాశం అతడికి దక్కగా.. రైడర్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్ ను జారవిడిచి కిందకు పడిపోబోయాడు. అయితే అనుకోకుండా అతడు పడిపోతూ బంతిని తిరిగి గాలిలోకి తన్నాడు, రెండవసారి మాత్రం క్యాచ్ తీసుకున్నాడు. ఈ క్లిప్‌ను 'దట్స్ సో విలేజ్' తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ క్యాచ్ పట్టాక అతడి జట్టు సభ్యులు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. నెటిజన్లు దీన్ని 'గ్రేటెస్ట్ క్యాచ్ డ్రాప్' అని అంటూ ఉన్నారు.



Tags:    

Similar News