భారత్ ను ఓడిస్తాం: పాక్ కెప్టెన్

బంగ్లాదేశ్ తో సూపర్ 4 మ్యాచ్ లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.

Update: 2025-09-26 12:37 GMT

బంగ్లాదేశ్ తో సూపర్ 4 మ్యాచ్ లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్ లో భారత్ తో తలపడనుంది. పాకిస్థాన్ ఇక ఫైనల్ ప్రత్యర్థి అయిన భారత్‌కు హెచ్చరికలు పంపింది. తుదిపోరులో టీమిండియా సహా ఏ జట్టునైనా ఓడించే సత్తా తమకుందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు. తాము ఏం చేయాలో స్పష్టంగా తెలుసు.. ఫైనల్ లో మైదానంలోకి అడుగుపెట్టి భారత్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తామని అలీ అన్నాడు. అయితే బ్యాటింగ్‌లో ఇంకా కొన్ని మార్పులు అవసరమని, దానిపై దృష్టి సారిస్తామని తెలిపాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు తలపడిన చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మూడోసారి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Tags:    

Similar News