IPL 2025 : ఎవరీ వైభవ్.. ఇంతగా బాదేస్తుంటే.. ఇన్నాళ్లూ ఏంచేస్తున్నాడంటే?
లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడిన మ్యాచ్ లో రాయల్స్ తరుపున వైభవ్ సూర్యవంశీ ఆడాడు.
ఐపీఎల్ లో సహజంగా కొత్త ఆటగాళ్లు మెరుస్తుంటారు. యువ ఆటగాళ్లు ఐపీఎల్ ను వేదికగా చేసుకుని అంతర్జాతీయ మార్కెట్ లో అదరగొడుతుంటారు. అనేక మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో ఫుల్లుగా సక్సెస్ అయి టీం ఇండియాలో చోటు సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. టీం ఇండియా జెర్సీ కోసం ఐపీఎల్ ను ఒక వేదికగా మార్చుకుంటారు కుర్రోళ్లు. ఎంతో మంది ఇలా వచ్చిన వాళ్లే. ఇప్పుడు టీంఇండియాలో ఉన్నది కూడా వాళ్లే. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి బీసీసీఐ కంట పడి సెలెక్ట్ అయి భారత్ తరుపున ఆడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.
చిన్న వయసులోనే...
తాజాగా మరో చిన్నోడు కూడా ఐపీఎల్ లో మెరిశాడు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ లో అరగేట్రం చేశాడు. వైభవ్ సూర్యవంశీ అనే కుర్రోడు పథ్నాలుగేళ్ల ఇరవై మూడు రోజులుకే మెరుపులు మెరిపించాడు. నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడిన మ్యాచ్ లో రాయల్స్ తరుపున వైభవ్ సూర్యవంశీ ఆడాడు. తొలిసారి ఐపీఎల్ మైదానంలో అడుగు పెట్టి ఏమాత్రం భయం, బెరకు లేకుండా వీర బాదుడు బాదేశాడు. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టేశాడు. వైభవ్ సూర్యవంశీ వచ్చీ రాగానే తొలి బంతికే సిక్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపోయేట్లు చేశాడు.
ఇరవై బంతుల్లోనే...
వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్ లోనే ఇరవై బంతుల్లో 34 పరుగులు చేసి ఔరా అనిపించాడు. బీసీసీఐ కంట్లో పడ్డాు. అయితే 34 పరుగులు చేసి అవుటయినప్పటికీ అప్పటికే అందరి కళ్లలో వైభవ్ రికార్డు అయిపోయాడు. పెద్ద పెద్ద అనుభవమున్న బ్యాటర్లే తడబడుతున్న సమయంలో అతి పిన్న వయసులో వచ్చిన వైభవ్ సూర్యవంశీ మాత్రం తడబాటు లేకుంటా బ్యాట్ ను ఝుళిపించడంతో ఇతనికి ఎప్పటికైనా టీం ఇండియా జెర్సీ దొరకడం ఖాయమనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆడిన తీరు కూడా అలాగే ఉంది. ఆల్ ది బెస్ట్ వైభవ్ సూర్యవంశీ.