Video : స‌ప్ప‌గా సాగుతున్న‌ మ్యాచ్‌లో న‌వ్వులు పూయించిన న‌క్క‌..!

లండన్ లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో మ్యాచ్ సంద‌ర్భంగా చోటుచేసుకున్న‌ ఓ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Update: 2025-08-06 06:44 GMT

లండన్ లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో మ్యాచ్ సంద‌ర్భంగా చోటుచేసుకున్న‌ ఓ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది సూపర్ ఓవర్ మ్యాచో.. లేదా రికార్డ్ బద్దలు కొట్టే ఇన్నింగ్స్ గురించో కాదు.. ఒక నక్క మైదానం మధ్యలో పరిగెత్తడం అందరినీ ఆశ్చర్యపరిచింది. న‌క్క మైదాన‌మంతా రౌండ్లు వేశాక మ్యాచ్‌ మళ్లీ ప్రారంభమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ది హండ్రెడ్ 2025 మొదటి మ్యాచ్ ఓవల్ ఇన్విన్సిబుల్స్, టీమ్ లండన్ స్పిరిట్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ సప్ప‌గా సాగుతోంది. లో స్కోరింగ్ మ్యాచ్. మ్యాచ్ జ‌రుగుతున్న సమయంలోనే న‌క్క అకస్మాత్తుగా గ్రౌండ్‌లోకి ప్రవేశించడంతో స్టేడియంలో ఉన్న అభిమానుల‌ను వినోదభరితంగా మార్చింది.

లండన్‌ స్పిరిట్‌ పేసర్‌ డేనియల్‌ వోరాల్‌ బంతిని వేయబోతుండగా, నక్క మైదానంలోకి దిగింది. ఆ సమయంలో ఇన్విన్సిబుల్స్ విజయానికి 72 పరుగులు కావాలి. న‌క్క‌ మైదానంలో వేగంగా పరిగెత్తింది. నక్క విన్యాసాన్ని చూసి స్టాండ్‌లో కూర్చున్న అభిమానులు కూడా చప్పట్లు కొట్టారు.

నక్క గ్రౌండ్ అంతా పరుగెత్తాక‌.. బౌండరీలైన్‌ల‌కు అమర్చిన హోర్డింగ్‌లను దూకి దానంతట అదే బయటకు వెళ్లింది. ఈ ఫన్నీ సంఘటన ప్రేక్షకులను, వ్యాఖ్యాతలను బాగా అలరించింది. వ్యాఖ్యాతలు స్టువర్ట్ బ్రాడ్, ఇయాన్ మోర్గాన్ కూడా న‌వ్వుల‌ను కంట్రోల్ చేసుకోలేక‌పోయారు.

మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. లండన్ జట్టు కేవలం 80 పరుగులకే ఆలౌట్ కాగా, ఓవల్ జట్టు 69 బంతుల్లో 81 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Tags:    

Similar News