నేడు జింబాబ్వేతో భారత్ తొలి వన్డే

నేడు జింబాబ్వేతో భారత్ తొలి వన్డే మ్యాచ్ ను ఆడనుంది. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Update: 2022-08-18 03:42 GMT

నేడు జింబాబ్వేతో భారత్ తొలి వన్డే మ్యాచ్ ను ఆడనుంది. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల వెస్టిండీస్ టూర్ లో వన్డే, టీ 20 సిరీస్ లను కైవసం చేసుకున్న ఇండియా మంచి ఊపు మీద ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ లను ఆడనుంది. జింబాబ్వే పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, బుమ్రా, షమీ, రిషబ్ పంత్ లు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. దీతో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని టీం ఇండియా జింబాబ్వే తో నేడు తలపడనుంది.

యువ ఆటగాళ్లతో...
శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఇద్దరు మాత్రమే సీనియర్లు. మిగిలిన వారంతా యువ ఆటగాళ్లే. రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి వారికి ఈ మ్యాచ్ లు ఆడేందుకు అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్ ఉండనుంది. అయితే జింబాబ్వే జట్టును కూడా అంత తేలిగ్గా అంచనా వేయలేం. ఇటీవల బంగ్లాదేశ్ ను ఓడించిన జింబాబ్వే జట్టు ఫామ్ లో ఉంది. బంగ్లాదేశ్ పై జింబాబ్వే జట్టు కూడా టీ 20, వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠత నెలకొంది.


Tags:    

Similar News