టీ20 వరల్డ్ కప్ పాక్ జట్టు ఇదే!!
టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ కు సంబంధించి తాత్కాలిక జట్టును ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘాను కెప్టెన్‌గా పీసీబీ ఎంపిక చేసింది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌కు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కింది. షాహీన్ అఫ్రిదికి కూడా జట్టులో చోటు లభించింది. మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ జట్టులో చోటు లభించలేదు. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా ఉస్మాన్ ఖాన్‌ను ఎంపిక చేశారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గ్రూప్-ఏలో పోటీ పడనుంది. భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.