సత్తా ఉంది.. పృథ్వీ షా సంచలన ఇన్నింగ్స్
టీ20 ముంబై లీగ్ లో పృథ్వీ షా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
Prithvi
టీ20 ముంబై లీగ్ లో పృథ్వీ షా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ ముంబై పాంథర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న షా, కేవలం 34 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని షా నిరూపించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ట్రయంఫ్ నైట్స్ జట్టుపై పాంథర్స్ విజయాన్ని అందుకుంది.
నార్త్ ముంబై పాంథర్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన 25 ఏళ్ల పృథ్వీ షా ఈ సీజన్‌లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 220కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. షా దూకుడుగా ఆడటంతో పాంథర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఒకప్పుడు భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడైన యువ బ్యాట్స్‌మెన్‌గా పేరుపొందిన షా, అనేక కారణాల వలన భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ ఏడాది కనీసం ఒక్క ఐపీఎల్ జట్టులో కూడా స్థానం సంపాదించలేకపోయాడు. పృథ్వీ షా తిరిగి ఫామ్‌లోకి రావడం క్రికెట్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.