T20 World Cup : గెలవాలంటే.. ప్రయోగాలు చేయాల్సిందేనట .. పాత వాసనలకు స్వస్తి చెప్పాలంటున్నారే

టీ 20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతుంది. మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది.

Update: 2024-04-23 06:03 GMT

టీ 20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతుంది. మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. మన దేశంలో కాకపోయినా ఈసారి కప్ కొట్టేటట్లు జట్టు ఎంపిక ఉండాలని భారత్ లో క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వరల్డ్ కప్ వన్డే కప్ చేజారిపోయిన నేపథ్యంలో టీ 20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచేందుకు జట్టు ఎంపిక ఉపయోగపడాలని ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు. బీసీసీఐ పెద్దలు జట్టు ఎంపికపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. అనేక మంతి క్రీడా నిపుణులు, మాజీ క్రికెటర్లు జట్టు ఇలా ఉండాలంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. విదేశీగడ్డపై జరిగే మ్యాచ్ లు కావడంతో అక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్ లకు అనుగుణంగా జట్టును ఎంపిక చేస్తే మంచిదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది.

పదేళ్ల తర్వాత...
2014లో భారత్ టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. తర్వాత ఇక సాధ్యపడలేదు. మళ్లీ దశాబ్దం తర్వాత వచ్చే అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో చెలరేగి ఆడుతున్న వారిని ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ఎంపిక చేస్తే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అనుభవం ఒక్కటే సరిపోదని, టీ 20 లలో దూకుడు కూడా అంతే ముఖ్యమన్న సూచనలు పలువురు క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. ఐపీఎల్ లో ఉన్న పది జట్లలో అనేక మంది యువక్రికెటర్లు తమ సత్తా చాటుతున్నారు. వారిలో ప్లస్, మైనస్ లను అంచనా వేసి జట్టు రూపకల్పన చేస్తే మంచిదన్న సూచనలు బీసీసీఐకి బాగానే అందుతున్నాయి.
ఎవరెవరు ఉండాలి?
ఓపెనర్ గా ఎవరుండాలి? ఫస్ట్ డౌన్ ఎవరు వస్తే స్కోరు వేగం పెంచగలరు? అత్యంత వేగంగా బౌండరీ వైపు ఎవరు బంతిని పరిగెత్తించగలరు? అలాగే ఆకాశమే హద్దులుగా సిక్సర్లు ఎవరు కొట్టగలరు? వికెట్లను కీలక సమయంలో తీయడమే కాకుండా, ప్రత్యర్థి జట్టులో బలమైన భాగస్వామ్యాన్ని విడదీసే శక్తి ఎవరికి ఉంది? అన్న అంచనాలతో జట్టును రూపొందించాలని క్రీడా నిపుణులు కోరుతున్నారు. ఐపీఎల్ లో ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ పరంగా అనేక మంది యువక్రికెటర్లు తమ సత్తాను చాటుతున్నారు. సీనియర్లు ఉండాల్సిన అవసరాన్ని కూడా కొందరు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి సూచిస్తున్నారు. అనుభవంతో పాటు విదేశీగడ్డపై అందులోనూ వెస్టిండీస్ పై ఆడగలిన సత్తా ఉన్న వారినే ఎంపిక చేయాలన్న సూచనల జాబితా పెద్దదే బీసీసీఐకి అందినట్లు చెబుతున్నారు.
యువ క్రికెటర్లతో పాటు...
యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సౌరభ్ గంగూలీ వంటి వారు విరాట్ కొహ్లి, రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగితేనే మంచిదని భావిస్తున్నారు. బౌలింగ్ లో మయాంక్ యాదవ్ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ వంటి వారికి చోటు కల్పించాలని కోరుకుంటున్నారు. సీనియర్ల పేరుతో అందరినీ పాత వారిని కాకుండా యువజట్టును ఎంపిక చేయాలన్న కోరిక చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం కోరుకుంటున్నట్లు కాదు.. అన్నీ ఆలోచించి బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఫామ్ లో ఉండటమే కాకుండా వెస్టిండీస్ మైదానంలో ఆడగలిగిన సత్తా ఉన్న వారిని ఎంపిక చేయాలన్న నిర్ణయంతో ఉంది. అందుకే వరల్డ్ కప్ జట్టు ఎంపిక అంత సులువు కాదు. కత్తి మీద సాము వంటిదేనంటూ క్రీడానిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    

Similar News