వైజాగ్ లో న్యూజిలాండ్ తో టీ20 మ్యాచ్

2026లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది.

Update: 2025-06-16 08:30 GMT

T20

2026లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నాలుగవ టీ20 మ్యాచ్ కు విశాఖపట్నం వేదికగా నిలిచింది. 2026 జనవరి 21 నుంచి జనవరి 31 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.


ఈ సిరీస్‌లో భాగంగా నాలుగవ టీ20 మ్యాచ్‌ను జనవరి 28న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. భారత్ లో న్యూజిలాండ్ పర్యటన జనవరి 11, 2026న బరోడాలో తొలి వన్డేతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత జనవరి 14, 18 తేదీల్లో రాజ్‌కోట్, ఇండోర్‌లలో తదుపరి రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. మూడు వన్డేల తర్వాత ఐదు T20Iలు జరగనున్నాయి.

Tags:    

Similar News