అలా పెడుతుంటే.. ఇలా అమ్ముడుపోతూ ఉన్నాయి..!

టీ20 ప్రపంచ కప్ లో కూడా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతూ ఉన్నాయి. అక్టోబర్ 23న

Update: 2022-08-25 03:34 GMT

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని ఏ మూలలో మ్యాచ్ లు నిర్వహించినా సోల్డ్ అవుట్ అనే బోర్డు పడాల్సిందే..! ఇప్పుడు ఆసియా కప్ 2022 లో భాగంగా మొదటి మ్యాచ్ ఈ ఆదివారం నిర్వహించనున్నారు. అయితే టికెట్లు ఆన్ లైన్ లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే అమ్ముడు పోతూ ఉన్నాయి. నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇప్పటికే పలు కేటగిరీలోని టికెట్లను నిర్వాహకులు అమ్మేశారు. ఇంకొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఇక ఆసియా కప్ విషయంలో మాత్రమే కాదు టీ20 ప్రపంచ కప్ విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంది. టీ20 ప్రపంచ కప్ లో కూడా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతూ ఉన్నాయి. అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియాలో కూడా భారత్-పాక్ మ్యాచ్ కు భారీ డిమాండ్ ఉంది. 4000 స్టాండింగ్ రూమ్ టికెట్లను అమ్మకానికి పెట్టనున్నారు. వీటి ధర 30 డాలర్లుగా చెప్పుకొచ్చారు. ఈరోజు t20worldcup.com లో అమ్మకానికి ఉంచారు. స్టాండింగ్ రూమ్ టిక్కెట్‌లు $30కి అందుబాటులో ఉంటాయి. first-come, first-served ప్రాతిపదికన విక్రయించబడతాయి. అదనపు టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఉన్న కారణంగా అభిమానులందరూ T20 ప్రపంచ కప్ టికెటింగ్ ఖాతాను ముందుగానే సృష్టించుకోవాలని చెబుతున్నారు. కొంచెం ఆలస్యమయినా టికెట్లు దొరికే అవకాశమే లేదు.
అక్టోబర్ 23 ఆదివారం జరగనున్న మ్యాచ్‌కి భారీగా అభిమానులు హాజరుకావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో విక్రయించిన ఐదు నిమిషాల్లోనే సాధారణ టిక్కెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక ICC హాస్పిటాలిటీ, ICC ట్రావెల్ & టూర్స్ ప్రోగ్రామ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి పరిమిత సంఖ్యలో ప్యాకేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ICC పురుషుల T20 ప్రపంచ కప్ లో భాగంగా టికెట్లను అధికారిక టికెటింగ్ సైట్ t20worldcup.com ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని అభిమానులకు నిర్వాహకులు సూచిస్తూ ఉన్నారు. అనధికారికంగా టిక్కెట్‌లను కొనుగోలు చేస్తే ఏ మాత్రం గారంటీ ఇవ్వలేమని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఇతర T20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లల టిక్కెట్‌లు కేవలం $5 నుండి పెద్దల టిక్కెట్‌లు $20 నుండి ప్రారంభమవుతాయి. నవంబర్ 13న MCGలో ఆడే ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు టిక్కెట్‌లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.


Tags:    

Similar News