దక్షిణాఫ్రికాను ఊరిస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు చారిత్రక విజయం దిశగా దూసుకెళ్తోంది.

Update: 2025-06-14 09:45 GMT

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు చారిత్రక విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట‌ర్ మార్క్ర‌మ్‌ అజేయ సెంచరీతో రాణించాడు. మార్క్రమ్ 102 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు విజయానికి కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది.


మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ టెంబా బవుమా అర్ధసెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా నాలుగో రోజు ఏదైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News