స్మృతి మంధాన చాలా రోజుల తర్వాత
భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది.
భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ జాబితాలో స్మృతి 727 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2019 తర్వాత స్మృతి మళ్లీ నంబర్‌వన్ ర్యాంకు సాధించింది.
ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరచడంతో మంధాన తిరిగి తన టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. నటాలీ సీవర్ బ్రంట్ 719 పాయింట్లతో రెండో స్థానం, లారా వోల్వార్ట్ 719 పాయింట్ల తోనే మూడో స్థానంలో నిలిచారు. ఇక భారత్ కు చెందిన జెమీమా రోడ్రిగ్స్ పదిహేను, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 16వ ర్యాంకులు సాధించారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 2024 ఏడాదికి గానూ ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్‌గా మంధాన నిలిచింది. గతేడాదిలో 13 మ్యాచ్‌లలో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది.