Asia Cup : టీం ఇండియాలో ఆరడుగుల బుల్లెట్

టీం ఇండియా నిన్న ఆసియా కప్ లో గెలవడానికి ప్రధాన కారణం శివమ్ దూబె అని చెప్పాలి

Update: 2025-09-29 07:37 GMT

టీం ఇండియా నిన్న ఆసియా కప్ లో గెలవడానికి ప్రధాన కారణం శివమ్ దూబె అని చెప్పాలి. ఆరడగుల బుల్లెట్ ఉంటే ఇప్పటి వరకూ టీ20 లలో టీం ఇండియాకు అపజయం ఎరుగదు. టీం ఇండియాకు శివమ్ దూబె లక్కీగా మారారు. సెంటిమెంట్ గా శివమ్ దూబె మారాడు. ఇండియా తరుపునఇప్పటి వరకూ శివమ్ దూబె 36 టీ20 మ్యాచ్ లు ఆడితే అందులో ఏ ఒక్క మ్యాచ్ లోనూ భారత్ జట్టు ఓడిపోలేదు.

శివమ్ దూబె సెంటిమెంట్...
ముప్ఫయి నాలుగు మ్యాచ్ లలో టీం ఇండియా గెలిచింది. రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. నిన్న ఆసియా కప్ లో హార్ధిక్ పాండ్యా గాయంతో వైదొలడంతో శివమ్ దూబె ఓపెనింగ్ బౌలింగ్ చేశాడు. పొదుపుగా శివమ్ దూబె బౌలింగ్ చేశాడు. వికెట్ తీయకపోయినా మూడు ఓవర్లలో ఇరవై మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్ లోనూ రాణించాడు. ఇరవై రెండు బంతుల్లో ముప్ఫయి మూడు పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు.


Tags:    

Similar News