ఆసియా కప్ కు ముందు పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్..!

ఆసియా కప్ కు ముందు పాకిస్థాన్ జట్టుకు షాక్

Update: 2022-08-14 03:06 GMT

ఆసియా కప్ ఎప్పుడు మొదలవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే భారత క్రికెట్ అభిమానులు మంచి క్రికెట్ మ్యాచ్ లను చూసి చాలా రోజులే అవుతోంది. ఆ దాహాన్ని ఆసియా కప్ తీర్చబోతోందని అందరూ భావిస్తూ ఉన్నారు. ఇక ఆగస్టు 28న పాకిస్థాన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడబోతోంది. భారీ హైప్ ఉన్న ఈ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం డౌట్ అని అంటున్నారు. షాహీన్ అఫ్రిది కొంతకాలం క్రితం గాయపడ్డాడు. దాని కారణంగా అతని ఆటపై సందేహాలు ఉన్నాయి. ఈ కారణంగా అతను శ్రీలంకతో రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ నెదర్లాండ్స్‌తో ఆడుతున్నప్పుడు, షహీన్ ఈ సిరీస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చని తెలుస్తోంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం షాహీన్ అఫ్రిది ఫిట్‌నెస్‌పై కీలక ప్రకటన చేశాడు. జట్టు వైద్యుడి పర్యవేక్షణలో ఉండేందుకు షాహీన్ ఆఫ్రిదిని నెదర్లాండ్స్‌కు తీసుకువెళతామని చెప్పాడు. అతను ఫిట్‌గా ఉంటే నెదర్లాండ్స్‌తో కూడా ఆడవచ్చని తెలిపాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లు కూడా ఉన్నందున, అందుకు సన్నద్ధమవుతున్నామని, సుదీర్ఘ ప్రణాళికతో దీన్ని ఆలోచిస్తున్నామని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది ఇండియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వికెట్లు ఉన్నాయి. పాకిస్థాన్ హీరోగా షాహీన్ నిలిచాడు. ఇక అదే టోర్నమెంట్ లో షాహీన్ అఫ్రీదికి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మాథ్యూ వేడ్ మూడు సిక్సర్లు బాది.. పాక్ ను టోర్నీ నుండి బయటకు పంపించాడు.


Tags:    

Similar News