T20 World Cup : సెమీస్‌కు న్యూజిలాండ్‌.. పాకిస్థాన్‌కు గెలిచినా ఇంటికే

T20 World Cup : సెమీస్‌కు న్యూజిలాండ్‌.. పాకిస్థాన్‌కు గెలిచినా ఇంటికే

Update: 2026-03-01 02:10 GMT

టీ 20 వరల్డ్ కప్ లో శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాకిస్తాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. అయితే సూపర్‌ ఎయిట్స్‌లో ముందుకు వెళ్లాలంటే శ్రీలంక లక్ష్యాన్ని 147 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంది. అది సాధ్యం కాలేదు. దీంతో న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ కు చేరుకుంది.పాకిస్తాన్ సూపర్ 8 నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 212 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను పాక్‌ బౌలర్లు పన్నెండు వ ఓవర్లో 101 పరుగులకు ఐదు వికెట్లుు తీసి కట్టడి చేశారు. అయినా గెలుపు సాధ్యమయినా పాక్ కోరిక మాత్రం నెరవేరలేుద.

పాక్ వైపు కనిపించినా...
101 పరుగుల వద్ద మ్యాచ్‌ పాక్‌ వైపు తిరిగినట్లే కనిపించింది. కానీ పవన్‌ రత్నాయకే 37 బంతుల్లో 58 పరుగులు చేసి నిలబెట్టాడు. కెప్టెన్‌ షనకా 31 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి మ్యాచ్‌ను చివరి వరకు లాగాడు. చివరి ఓవర్‌లో షహీన్ షా ఆఫ్రిది బౌలింగ్ లో 4-6-6-6 బాదాడు. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా ఐదో బంతిని స్కూప్‌ చేయాలనుకుని మిస్‌ అయ్యాడు. చివరి బంతిని వైడ్‌ అనుకుని వదిలేశాడు. అది యార్కర్‌. దాంతో శ్రీలంక 148 పరుగులకే ఆగింది.
ఫర్హాన్ శతకం వృధా...
ఫర్హాన్‌ 60 బంతుల్లో శతకం సాధించాడు. ఒకే టోర్నీలో విరాట్ కోహ్లి 2014లో చేసిన 319 పరుగుల రికార్డును దాటాడు. ఫర్హాన్‌ 40 పరుగులకు చేరగానే ఆ మార్క్‌ దాటేశాడు. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో 383 పరుగులు చేశాడు. “శతకం జట్టుకు ఉపయోగపడలేదు. అందుకే బాధగా ఉంది. నాకిప్పుడు మంచి ఫామ్‌ ఉంది. ఏ బంతినైనా కొట్టగలనని తెలుసు” అని ఫర్హాన్‌ చెప్పారు. జమాన్‌ 42 బంతుల్లో 84 పరుగులు చేసి 16వ ఓవర్‌లో ఔటయ్యాడు. 11వ ఓవర్‌లో 46 పరుగుల వద్ద ఎడ్జ్‌ అయినా శ్రీలంక టీవీ రిఫరల్‌ కోరలేదు. ఆ సమయంలో స్కోరు 107-0. చివరి 26 బంతుల్లో ఎనిమిది వికెట్లు తీసి 36 పరుగులే ఇచ్చి శ్రీలంక బౌలర్లు పుంజుకున్నారు. దిల్షాన్‌ మదుశంక 3-33, షానకా 2-42తో మెరుగైన ప్రదర్శన చేశారు.
సెమీస్ కు మూడు టీంలు...
శ్రీలంక టాప్‌ ఆర్డర్‌ను అబ్రార్‌ అహ్మద్‌ మూడు వికెట్లు తీసి దెబ్బతీశాడు. అయితే డ్యూ వల్ల బంతి తడవడంతో బౌలర్లకు లెంగ్త్‌ కుదరలేదు. ఉస్మాన్‌ తారిఖ్ భారీగా పరుగులు ఇచ్చి తన స్పెల్ ను ముగించాడు. వరుసగా 26 ఇన్నింగ్స్‌లలో వికెట్‌ తీసిన రికార్డు దాటే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక సెమీఫైనల్‌కు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించినట్లయింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇండియా నేడు వెస్టిండీస్ పై జరిగే పోరులో ఎవరు గెలిస్తే వారు సెమీ ఫైనల్స్ కు చేరుతారు. వచ్చే వారం భారత్ లోనే రెండు సెమీఫైనల్స్ తో పాటు మార్చి 8వ తేదీన ఫైనల్స్ కు ఆతిధ్యం ఇవ్వనుంది.


Tags:    

Similar News