రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న రాస్ టేలర్
న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2021 డిసెంబర్ లో వీడ్కోలు పలికాడు 41 ఏళ్ల రాస్ టేలర్. తాజాగా రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. కివీస్ తరఫున కాకుండా కొత్త జట్టు సమోవాకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. మరో జట్టుకు ఆడేందుకు అవసరమైన మూడేళ్ల స్టాండ్‌ఔట్ వ్యవధి పూర్తి కావడం కూడా టేలర్‌కు కలిసొచ్చింది. 2026లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆ టోర్నీకి అర్హత సాధించాలంటే ఆసియా - ఈస్ట్ ఆసియా - పసిఫిక్ రీజియన్ తరఫున 2026 క్వాలిఫయర్‌లో సమోవా జట్టు అద్భుతమైన ఫలితాలను సాధించాలి. ఒమన్ వేదికగా ఈ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతాయి. రాస్ టేలర్ తల్లి తరఫున వారసత్వం సమోవాలోనే ఉండటంతో తన రెండో ఇన్నింగ్స్‌ను ఇక్కడి నుంచి ప్రారంభించాలని టేలర్ నిర్ణయం తీసుకున్నాడు.