India : రోకో జంటను ప్రపంచ కప్ లో చూడటానికి ఉన్న అవకాశాలు?
స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు 2027 వన్డే ప్రపంచకప్ లో ఆడే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు 2027 వన్డే ప్రపంచకప్ లో ఆడే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది. వన్డే వరల్డ్ కప్ లో ఆడి రిటైర్ కావాలని ఇద్దరూ భావిస్తున్నారు. అయితే అప్పటి వరకూ జట్టులో కొనసాగించడం బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. ఇంకా రెండేళ్లు సమయం ఉండటంతో వీరిద్దరు కొనసాగడంపై మాత్రం సస్పెన్స్ కొన్ని రోజుల పాటు కొనసాగనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఫామ్ లేని ఇద్దరూ తిరిగి పుంజుకోవడంతో వీరు కొనసాగుతారా? లేదా? అన్నది పక్కన పెడితే వచ్చే నెలలో మాత్రం దక్షిణాఫ్రికా టూర్ లో తిరిగి కనిపించనున్నారు.
ఆస్ట్రేలియా సిరీస్ లో...
ఆస్ట్రేలియాలో జరిగిన మూడు మ్యాచ్ లలో రోహిత్ శర్మ రెండు మ్యాచ్ లలో మంచి స్కోరు సాధించారు. హిట్ మ్యాన్ పెర్త్ మ్యాచ్ లో ఎనిమిదిపరుగులు చేసి నిరాశపర్చాడు. ఆడిలైడ్ 73 పరుగులు చేయగా, సిడ్నీలో మాత్రం 121 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లి మాత్రం పెర్త్, ఆడిలైడ్ లో డకౌట్ అవ్వగా, సిడ్నీలో మాత్రం 74 పరుగులు చేశాడు. దీంతో సిడ్నీలో భారత్ విజయం సాధించి వైట్ వాష్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇద్దరూ నాటౌట్ గా నిలిచి రాణించడంతో వారి ఫామ్ పై ఉన్న అనుమానాలు పటాపంచాలయ్యాయి. అయితే భారత్ ఎక్కువగా టీ20లే ఎక్కువగా ఆడుతుంటుంది. వన్డేలు ఆడటం చాలా తక్కువ. అందుకే మరో రెండేళ్లు వన్డే ప్రపంచ కప్ వరకూ ఉండటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో...
తిరిగి వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కనిపించే అవకాశముంది. వచ్చే నెల 30వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. భారత్ లో జరగనున్న ఈ మ్యాచ్ లలో ఆడి రోకోల జంట తమ సత్తాను నిరూపించుకోవాల్సి ఉంది. నవంబరు 30వ తేదీన రాంచీలో తొలి వన్డే, డిసెంబరు 3వ తేదీన రాయపూర్ లో రెండో వన్డే, డిసెంబరు ఆరోతేదీన విశాఖలో మూడో వన్డే జరగనుంది. ఈ మూడు మ్యాచ్ లలో ఆడి మంచి పరుగులు సాధించినా తర్వాత న్యూజిలాండ్ సిరీస్ లో కూడా ఈ ఇద్దరూ ఆడే అవకాశముంది. రెండు సిరీస్ లలో మంచి పెర్ ఫార్మెన్స్ చూపినప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల మరో రెండేళ్లు ప్రపంచ కప్ కోసం ఎదురు చూడాల్సి ఉంది. సాధ్యమేనా? అంటే చాలా తక్కువ ఛాన్సెస్ అని ఖచ్చితంగా చెప్పాలి.