సిరీస్ విజయం తర్వాత రోహిత్ శర్మ చెప్పింది.. ఇదే!!

ధ‌ర్మ‌శాల టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు భార‌తజట్టు ముందు కనీసం నిలవలేకపోయింది. 259 ప‌రుగులు వెన‌క‌బ‌డి

Update: 2024-03-09 12:51 GMT

ధ‌ర్మ‌శాల టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు భార‌తజట్టు ముందు కనీసం నిలవలేకపోయింది. 259 ప‌రుగులు వెన‌క‌బ‌డి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. టీమిండియా ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో గెలిచింది. భారతజట్టు ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ ఒక్క‌డే 84 ప‌రుగుల‌తో పోరాడాడు. జానీ బెయిర్‌స్టో 39 ప‌రుగులు చేశాడు. ఇక మిగిలిన ఇంగ్లీష్ బ్యాట‌ర్లు ఎవ‌రూ పెద్ద స్కోర్లు చేయ‌లేక‌పోయారు. 195 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. భార‌తజట్టు తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేయ‌గా, ఇంగ్లండ్ 218 ప‌రుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. యశస్వీ జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

ఓ దశలో టీమిండియాపై కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలే తమలో కసి రగిల్చాయని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. జట్టులోకి కొందరు అనుభవం లేని కుర్రాళ్లు వచ్చినా.. పట్టుదలగా ఆడి ఇంగ్లండ్ ను ఓడించామని రోహిత్ అన్నాడు. కొత్త కుర్రాళ్లు పరిస్థితులకు అనుగుణంగా స్పందించిన తీరు ఆకట్టుకుందని రోహిత్ శర్మ ప్రశంసించాడు. గాయం నుంచి కోలుకుని వచ్చాక కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అతడి బౌలింగ్ ప్రదర్శన అమోఘంమని.. జైస్వాల్ కు అద్భుతమైన భవిష్యత్ ఉందని అన్నాడు. అతడు చాలాకాలం పాటు టీమిండియాకు సేవలు అందించే సత్తా ఉన్న ఆటగాడని ప్రశంసించాడు.


Tags:    

Similar News