విధ్వంసం సృష్టించిన పృథ్వీ షా

పృథ్వీ షా మైదానంలో విధ్వంసం సృష్టించాడు. మహారాష్ట్ర తరఫున తన రెండో రంజీ మ్యాచ్‌లో కేవలం 141 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ బాదాడు.

Update: 2025-10-27 14:27 GMT

పృథ్వీ షా మైదానంలో విధ్వంసం సృష్టించాడు. మహారాష్ట్ర తరఫున తన రెండో రంజీ మ్యాచ్‌లో కేవలం 141 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ బాదాడు. చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీలతో ఆకట్టుకున్నాడు షా. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీగా రికార్డులకెక్కింది. మొత్తం 156 బంతులు ఎదుర్కొన్న షా 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్‌ సెంచరీ చేసే క్రమంలో షా కేవలం 72 బంతుల్లోనే సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటైన షా రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ సాధించాడు.

Tags:    

Similar News