బౌండరీ లైన్ వద్ద పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన
ఆసియా కప్ 2025లో సూపర్ 4 లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ ప్రవర్తన తీవ్ర వివాదాస్పదంగా మారింది.
ఆసియా కప్ 2025లో సూపర్ 4 లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ ప్రవర్తన తీవ్ర వివాదాస్పదంగా మారింది. మైదానంలో క్రీడాస్ఫూర్తిని మరిచి, భారత అభిమానులను రెచ్చగొట్టేలా సైగలు చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవూఫ్ అభిమానుల వైపు చూస్తూ తన చేతివేళ్లతో '6-0' అని చూపించాడు. అంతటితో ఆగకుండా, విమానం కూలిపోతున్నట్టుగా సైగలు చేస్తూ రెచ్చగొట్టాడు. ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్థాన్ చేస్తున్న నిర్ధారణ లేని వాదనలకు ఈ '6-0' సైగ ప్రతీక అని తెలుస్తోంది. మ్యాచ్‌కు ముందు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన పాకిస్థాన్ ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆటగాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు.