అమ్మాయిల చేతిలో పాక్ చిత్తు చిత్తు
నాలుగు ఆదివారాలు.. నాలుగు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లు. ఫలితం మాత్రం ఒక్కటే భారత్ దే సంపూర్ణ విజయం.
నాలుగు ఆదివారాలు.. నాలుగు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లు. ఫలితం మాత్రం ఒక్కటే భారత్ దే సంపూర్ణ విజయం. ఆసియా కప్ లో మెన్స్ టీమ్ విజయాలతో మొదలవ్వగా.. ఇప్పుడు మహిళల టీమ్ వన్డే ప్రపంచ కప్ విజయంతో భారతీయుల్లో ఆనందాన్ని నింపింది. వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్జాన్ చేతిలో ఇప్పటి వరకు భారత్ ఓడింది లేదు. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 88 పరుగుల భారీ తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకుంది. ఎవరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో భారత స్కోరు 247 పరుగులకు పరిమితమైంది. ఇక పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లు పడగొట్టింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు కట్టుదిట్టంగా కట్టడి చేశారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి ఆమెకు ఏమాత్రం సహకారం అందలేదు. చివరికి పాకిస్థాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది.