పాకిస్థాన్.. పని అయిపోయింది

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్

Update: 2023-10-28 01:40 GMT

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. చివరికి దక్షిణాఫ్రికా 1 వికెట్ తేడాతో గెలిచింది. ఈజీగా గెలిచే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పీకల మీదకు తెచ్చుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ కేశవ్ మహరాజ్ ఫోర్ కొట్టడంతో పాక్ కు ఓటమి ఎదురైంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఓ దశలో దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలోనే కనిపించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్ క్రమ్ 91 పరుగులు చేసి ఉసామా మిర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరగా.. డేవిడ్ మిల్లర్ 29, మార్కో యన్సెన్ 20 పరుగులు చేశారు. 48వ ఓవర్ ను స్పిన్నర్ నవాజ్ రెండో బంతిని లెగ్ సైడ్ వేయడంతో కేశవ్ మహారాజ్ బౌండరీ కొట్టి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో ఓటమితో పాక్ సెమీస్ చేరడం కష్టమే!!

పాకిస్థాన్‌పై విజయం సాధించిన సఫారీ టీమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ ఖాతాలో కూడా 10 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో రెండవ స్థానానికి పరిమితమైంది. ఒక మ్యాచ్ తక్కువ ఆడింది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ మూడో స్థానంలో, ఆస్ట్రేలియా 4వ, శ్రీలంక 5వ, స్థానాల్లో ఉన్నాయి. ఆరు మ్యాచ్‌లు ఆడిన పాక్ కేవలం రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లకు పరిమితమైంది. ఈ ఓటమితో పాక్ సెమీస్ చేరే అవకాశాలు దాదాపు ముగిసిపోయాయి. పెనుసంచలనాలు నమోదైతే తప్ప పాకిస్థాన్ టాప్-4లో అడుగుపెట్టే అవకాశం లేదు.


Tags:    

Similar News