WTC ఫైనల్ కు వేళాయె.. విజయం ఎవరిని వరించేనో?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది.

Update: 2025-06-11 10:27 GMT

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది. లార్డ్స్‌ మైదానంలో జూన్ 11 నుంచి జరిగే ఫైనల్‌ పోరులో విజేత కోసం క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తూ ఉంది. 2023-25 సీజన్‌ ఛాంపియన్ ఎవరో ఈ టెస్ట్ మ్యాచ్ తో తేలనుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ లో తలపడనున్నాయి.


మేజర్ ఐసీసీ టైటిల్ ను గెలవాలని దక్షిణాఫ్రికా జట్టు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తూ ఉంది. అది ఈసారైనా సాకారం అవుతుందని ఆ జట్టు అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. ఇక ఐసీసీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి కూడా వీలు లేదు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 13 ఐసీసీ ఫైనల్స్‌ ఆడిన ఆస్ట్రేలియా 10 టైటిల్స్‌ సాధించింది. పిచ్ ఏ జట్టుకు అనుకూలిస్తుందో, ఏ జట్టు ఒత్తిడి నుండి బయట పడుతుందో త్వరలోనే తెలియనుంది.

Tags:    

Similar News