INDvsSA: దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్న భారత బౌలర్లు.. 15 కే 4 వికెట్లు

మొదటి టెస్టులో ఓటమిపాలైన భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన ఆరంభాన్ని సొంతం

Update: 2024-01-03 09:05 GMT

మొదటి టెస్టులో ఓటమిపాలైన భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. మొహమ్మద్ సిరాజ్ మూడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. సిరాజ్ బౌలింగ్ లో మార్క్రమ్ అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ మంచి క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత డీన్ ఎల్గార్ 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. సిరాజ్ బౌలింగ్ లో ఇన్ సైడ్ ఎడ్జ్ అయ్యి.. బౌల్డ్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్ లో స్టబ్స్ 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక టోనీ డీ జార్జీ సిరాజ్ బౌలింగ్ లో కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో పడింది.

దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ 1-1తో సమం చేసుకుంది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌ను సైతం 1-1తో సమం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన భారత్.. ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచి 32 ఏళ్ల నిరీక్షణకు తెరదించడం కుదరకపోవచ్చు. రెండో మ్యాచులో గెలిచి కనీసం సిరీస్‌ను డ్రా చేయాలని భావిస్తోంది భారత్. ప్రస్తుతం 14 పాయింట్లతో డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా 6వ స్థానంలో ఉంది. కేప్‌టౌన్ వేదికగా జరిగే రెండో టెస్టులో ఓడితే.. మరింత దిగజారే అవకాశం ఉంది. సెంచూరియన్ పిచ్‌లాగే.. కేప్‌టౌన్‌ పిచ్ కూడా బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా పేసర్లకు సహకారం లభించనుంది.


Tags:    

Similar News