సెంచరీలు చేశారు.. వికెట్లు పారేసుకున్నారు

ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో భారత ఆటగాళ్లు

Update: 2023-09-24 11:38 GMT

ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో భారత ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లు సెంచరీలు సాధించారు. తొలి వన్డేలో రాణించిన గిల్ రెండో వన్డేలోనూ సెంచరీ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీతో అలరించాడు.

శ్రేయాస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతనికి మూడో శతకం. సెంచరీ తర్వాత ఫోర్ కొట్టిన అయ్యర్ ఆ తర్వాత 105 పరుగులు చేసి ఔటయ్యాడు. సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ కూడా సెంచరీ చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో గిల్‌కు ఇది ఆరో సెంచరీ. 92 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ అబాట్ బౌలింగ్ లో అవుట్ అవ్వగా.. గిల్ గ్రీన్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకుంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మ్యాచ్‌కు దూరమవ్వడంతో.. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌ గా బాధ్యతలు చేపట్టాడు. మిచ్ మార్ష్ కూడా దూరంగా ఉండగా.. పేసర్ స్పెన్సర్ జాన్సన్‌ అరంగేట్రం చేశాడు. భారత జట్టులో బుమ్రా స్థానంలో ప్రసిధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు.


Tags:    

Similar News