పాకిస్థాన్ పై భారత్ సూపర్ విక్టరీ

పాకిస్థాన్ పై భారత్ సూపర్ విక్టరీ.. పాకిస్థాన్ పై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా టీ20 మ్యాచ్ లో

Update: 2022-07-31 13:23 GMT

పాకిస్థాన్ పై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా టీ20 మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీని అందుకుంది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎక్కడ కూడా భారత జట్టు ముందు పాకిస్థాన్ నిలవలేకపోయింది. 18 ఓవర్లలో పాకిస్థాన్ కేవలం 99 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాక్ ఓపెనర్ మునీబా అలీ 32 పరుగులతో రాణించింది. ఆమె మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాటర్లు ముగ్గురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. స్నేహ్ రానా, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ చెరో వికెట్ తీశారు.

100 పరుగుల టార్గెట్ ను చేరుకోవడంలో భారత బ్యాటర్లను పాక్ బౌలర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. స్మ్రితి మందాన బౌండరీలతో హోరెత్తించింది. షెఫాలీ వర్మ 9 బంతుల్లో 16 పరుగులు చేసి వెనుదిరగగా.. సబ్బినేని మేఘన 16 బంతుల్లో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఇక జెమీమా రోడ్రిగెజ్ తో కలిసి మందాన మ్యాచ్ ను ముగించింది. భారత్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మందాన 42 బంతుల్లో 63 పరుగులు చేసి విజయాన్ని అందించింది.


Tags:    

Similar News