India - Westindies 2nd Test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

భారత్ - వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమయింది

Update: 2025-10-10 04:53 GMT

భారత్ - వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమయిది. తొలి టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా రెండో టెస్ట్ లోనూ గెలిచేందుకు శ్రమిస్తుంది. భారత్ కెప్టెన్ శుభమన్ గిల్ సారథ్యంలో ఈ మ్యాచ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ భారత్‌ ఎంచుకుంది. వెస్టిండీస్ ఫీల్డింగ్ చేయనుంది.

భారీ స్కోరు దిశగా...
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తన సారథ్యంలోని తొలి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది రెండో టెస్ట్‌. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో రోస్టన్‌ చేజ్‌ నేతృత్వంలోని వెస్టిండీస్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ తేడాతో 140 పరుగుల విజయం సాధించింది. అదే జట్టుతోనే భారత్‌ మైదానంలోకి దిగింది. అత్యధిక స్కోరు సాధించాలన్న లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగింది. క్లీన్ స్వీప్ చేయాలన్న ఉద్దేశ్యంతో తొలుత భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత్‌ జట్టు ఇదే
యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, బి. సాయి సుధర్షన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), నితేష్‌ కుమార్‌ రెడ్డి‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా‌, మహ్మద్‌ సిరాజ్‌.










Tags:    

Similar News